‘సిరివెన్నెల’ ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నా.. చిరంజీవి భావోద్వేగం

chiranjivi-and-sirivennela

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి ముందు సిరివెన్నెల తనకు కాల్  చేసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.

త్వరలో వచ్చేస్తా చెన్నై కి ట్రీట్మెంట్ కోసం వెళ్దాం అన్నారని గుర్తు చేసుకొని కుమిలిపోయారు. ‘‘మంత్ ఎండ్ కు వస్తా అని నాతో అన్నారు.. ఇలా జీవం లేకుండా వస్తాడు అనుకోలేదు.. సిరివెన్నెల నన్ను ఎప్పుడు మిత్రమా అని పిలిచేవారు.’’ అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

sirivennela-and-chiranjivi

ఓ గొప్ప కవి వృక్షాన్ని కోల్పోయామన్నారు. సమాజంలో కుళ్లు కడిగేసే రీతిలో ఆయన పాటలు ఉంటాయని, తెలుగు సాహిత్యానికి సిరివెన్నెల లాస్ట్ లెజెండ్.. ఆయన లోటు ఎవరు తీర్చలేరు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు.. మిత్రమా వియ్ మిస్ యూ… అంటూ బాధప్త హృదయంతో సిరివెన్నెలతో తన అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

chiranjivi-with-sirivennela