సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్ ప్లైఓవర్‌పై కారు దగ్ధం

Car burnt on Secunderabad Parade Ground Flyover

సికింద్రాబాద్ పరేడ్‌ మైదానం (వైఎంసీఏ) ఫ్లై ఓవ‌ర్‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన కారు డ్రైవ‌ర్ త‌క్ష‌ణ‌మే వాహ‌నాన్ని ఆపాడు. ఆ వెంట‌నే కారులో నుంచి డ్రైవ‌ర్ దిగిపోయాడు. కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో అన్ని వాహ‌నాలు ఆగిపోయాయి. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కారు దగ్ధం వల్ల ప్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఉన్నట్టుండి వాహనంలో మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాప‌క సిబ్బంది కూడా ఘ‌టాన‌స్థ‌లికి స‌కాలంలో చేరుకోలేక‌పోయింది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. క్రేన్‌ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ఈ అగ్నిప్ర‌మాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.