సంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం - TNews Telugu

సంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం



సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నిన్న రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.  కొత్తగా కొన్న కారును అతివేగంగా నడపడంతో అది అదుపుతప్పింది. పక్కనే ఉన్న బైక్ ని ఢికొట్టగా అది ధ్వంసమైంది.

అదే సమయంలో అక్కడే ఉన్న చిన్నారులు పక్కకు జరగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. కారు బీభత్స దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో స్థానికంగా వైరల్ అవడంతో వెలుగులోకి వచ్చింది.