డివైడర్‌ దాటి టిప్పర్‌ను ఢీకొన్న కారు.. హెడ్ కానిస్టేబుల్ మృతి - TNews Telugu

డివైడర్‌ దాటి టిప్పర్‌ను ఢీకొన్న కారు.. హెడ్ కానిస్టేబుల్ మృతిసంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ జాతీయ రహదారిపై గురుకుల పాఠశాల సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు వైపు నుండి సంగారెడ్డి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి..  డివైడర్ దాటి సంగారెడ్డి వైపు నుండి వస్తున్న టిప్పర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు లో ప్రయాణిస్తున్న  హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.