రష్యాలో కార్గో విమానం కుప్పకూలింది. ఇల్యుషిన్ ఇల్-76 అనే కార్గో విమానం శుక్రవారం ఉదయం రియాజాన్ నగరానికి సమీపంలో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది ఉన్నారు. మిగతా ఆరు గాయపడ్డారు. అసలు ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.