జీఎస్టీ భవన్ లో సీబీఐ మెరుపు దాడులు.. చిక్కిన లంచగొండి అధికారులు

cbi

బషీర్ బాగ్ లోని జీఎస్టీ భవన్ లో మెరుపు దాడులు చేసిన సీబీఐ అధికారులకు పలువురు లంచగొడి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కస్టమ్స్ విభాగంలో సోదాలు చేసిన సీబీఐ అధికారులకు లంచం తీసుకున్న పలువురు అధికారులు చిక్కారు. కస్టమ్స్ అండ్ యాంటీ విజన్ వింగ్ లో పనిచేస్తునన సూపరిండెంటెండ్ సురేష్ కుమార్, ఇన్స్పెక్టర్ కిషన్ పాల్ సీబీఐ అధికారులకు చిక్కారు.

cbi officers rides on Hyderabad GST Bhavan
cbi officers rides on Hyderabad GST Bhavan

బిల్లులు మెయింటెన్ చేయని షాపులు, పలు కంపెనీ్లో తనిఖీలు చేసిన సమయంలో లంచాలు అడిగినట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇద్దరు అధికారులను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన అధికారులకు సంబంధించి ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల లెక్కల గుట్టు విప్పుతున్నారు.