కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు

community kitchens

దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మూడు వారాల వ్యవధిలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన మోడల్ కమ్యూనిటీ కిచెన్స్ స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో బృందం ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.

కమ్యూనిటీ కిచెన్ల పథకానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్ ను కార్యదర్శుల బృందం రూపొందించనున్నది. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేలా పూర్తి పారదర్శకంగా ఉండేలా పథకాన్ని రూపొందించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.  ఈనెల 29న మరోసారి కేంద్ర, రాష్ట్రాల ఆహార కార్యదర్శులు సమావేశం కానున్నారు.