టాటా గ్రూప్ సొంతమైన ఎయిర్ ఇండియా… అప్పగించిన ప్రభుత్వం

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రభుత్వం టాటాలకు అప్పగించింది. దీంతో మళ్లీ టాటా గ్రూప్ కే ఎయిర్ ఇండియా దక్కినట్లైంది. ఎయిర్ ఇండియాను జాతీయం చేయకముందు టాటాలే ముందుగా విమాన సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత విమాన రంగాన్ని జాతీయం చేయటంతో టాటాలు సంస్థను ప్రభుత్వానికి అప్పగించారు. ఇటీవల ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం భావించటం…ఆ తర్వాత అందుకు సంబంధించిన బిడ్ లను ఆహ్వానించటం చేసింది. ఐతే టాటా సంస్థ అత్యధికంగా బిడ్ వేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. ఐతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ను కేంద్రం గురువారం పూర్తి చేసింది. ఈ విషయాన్ని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ధృవీకరించారు.

ప్రధాని మోడీతో టాటాసన్స్ చైర్మన్ భేటీ

అటు ఎయిర్ ఇండియా అప్పగింత ప్రక్రియ పూర్తికావటంపై టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో టాటా సన్స్ చైర్మన్ భేటీ అయిన ఫోటోను పీఎంవో ట్విట్టర్ లో షేర్ చేసింది. అటు అప్పులతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియాను ఆదుకోవటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం అంగీకారం తెలిపింది.