హుజురాబాద్ కి మాత్రమే ఎలక్షన్ కోడ్ : కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల కోడ్ కేవలం హుజురాబాద్ కి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధకారికి సీఈసీ సమాచారం అందించింది. ఉపఎన్నిక జరిగే నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ తెలిపింది. కరీంనగర్, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు కూడా త్వరలో నిర్వహించనున్ననేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేసింది.’


ఇదిలా ఉండగా.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల పేర్లు ఖరారయ్యాయి. 20 మంది నేతలతో జాబితా సిద్ధం చేసినట్టు ఎన్నికల కమిషన్ కు తెరాస వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లతో పాటు మరికొంత మంది ముఖ్యనేతల పేర్లున్నాయి.