పెట్రోల్, డీజిల్ ధరలపై శతాబ్ది ఉత్సవాలు చేయండి.. కేంద్ర ప్రభుత్వానికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం సెటైర్

Central Ex Finance Minister Setires On BJP Government About Petrol, Diesel Price hikes

మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వంపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై విమర్శలు చేశారు. ధరల పెరుగుదల విషయంలో కేంద్రం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి అంటూ ట్విట్టర్లో చురకలంటించారు. అన్నీ శతాబ్ది ఉత్సవాల మాదిరిగానే.. ప్రధాని, ఇతర కేంద్రమంత్రులు 100 కోట్ల డోసుల టీకా పంపిణీపై సంబురాలు చేసుకున్నారు కదా.. ఇప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటింది. గ్యాస్ ధర రూ.1000 దాటింది. మరోసారి సంబురాలు చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకా లేటెందుకు.. పెట్రోల్, డీజిల్ రేట్లపై శతాబ్ధి ఉత్సవాలు చేసుకోండి అంటూ ట్వీట్ చేశారు.

ఆదివారం వరకు వరుసగా రోజూ పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో పెట్రోల్ ధరలు పెరిగితే.. నిరసనలు తెలిపిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెంచుతూనే ఉండటం పట్ల ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59 కాగా.. హైదరాబాద్ లో రూ.111.92, భోపాల్ లో అయితే.. రూ.116.26 గా ఉంది.