ముఖ్యమంత్రిని తిట్టిన కేంద్ర మంత్రి అరెస్ట్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టులు

Central Minister Narayan Rane Was Arrested
Central Minister Narayan Rane Was Arrested

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను ఉద్ధేశించి.. చెంప దెబ్బ కొట్టేవాడిని అని కామెంట్ చేసిన కేంద్రమంత్రి నారాయణ్ రాణెను పోలీసులు అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో ఉన్న కేంద్రమంత్రి కోసం పోలీసులు సంగమేశ్వర్ వెళ్లి.. అక్కడ అరెస్టు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె అరెస్టును తప్పించుకోవడానికి బెయిల్ కోసం రత్నగిరి కోర్టు, బాంబే హైకోర్టులకు వెళ్లాడు. కాగా.. రెండు కోర్టులు ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టివేశాయి.

Central Minister Narayan Rane Was Arrested
Central Minister Narayan Rane Was Arrested

ముందస్తు పిటిషన్ పై అత్యవసరంగా విచారించాలని కోరిన కేంద్రమంత్రి విజ్ఞప్తిని ముంబై హైకోర్టు తిరస్కరించింది. దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడిని అని జన్ ఆశీర్వాద్ యాత్రలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. స్పందించిన పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్టు ప్రక్రియ ప్రారంభించారు.