అబద్ధాల బీజేపీ.. అభివృద్ధి టీఆర్ఎస్.. మీ ఓటెవరికి?

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీకి.. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తూ ప్రచారం చేస్తున్న తేడాను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అబద్ధాలకు.. అభివృద్ధికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు తమ వైపు ఉంటారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. జూటమాటల ఈటలకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కమలాపూర్ మండలం గూడురులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని.. హుజురాబాద్ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ గెలుపుతోనే సాధ్యమని ఆయన తెలిపారు.


ఒకరు స్వార్థం కోసం రాజీనామా చేస్తే ఈ ఎన్నికలు వచ్చాయని.. ప్రజల వైపు నిలబడేందుకు టీఆర్ఎస్ పోటీలో ఉందని.. ప్రజలంతా తెరాస వైపే ఉన్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి.. గ్యాస్‌, పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచి సామాన్యుడి న‌డ్డి విరుస్తున్న బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్‌కు ఓటేస్తే హుజూరాబాద్‌కు మొండిచెయ్యి చూపిస్తారని ధర్మారెడ్డి అన్నారు.


గెల్లు శ్రీనివాస్‌ పేదింటి బిడ్డ.. ప్రజల సమస్యలు తెలిసినోడు. హుజురాబాద్ కి ఏం చేయాలో.. ఎలా అభివృద్ధి చేయాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లుకు పూర్తి అవగాహన ఉన్నదని ధర్మారెడ్డి అన్నారు. కారుగుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంద‌న్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు.. తెరాస కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.