తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ(శుక్రవారం) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది. రాష్ట్రంలోకి నైరుతి, పశ్చిమ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ.. రాగల 48 గంటల్లో అకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ మినహా అన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.