నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CSIR యూజీసీ నెట్ 2021 పరీక్ష తేదీలను మార్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ ఆయా తేదీల్లో కొన్నిఇతర ప్రధాన పరీక్షలతో క్లాష్ కారణంగా పరీక్ష తేదీలను వాయిదా వేసింది.
పరీక్ష ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరగాల్సిన పరీక్షలు ఫిబ్రవరి 15 ,18 తేదీలలో నిర్వహించనున్నట్లు NTA తెలిపింది. కొత్త షెడ్యూల్ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని కోరింది.
CSIR యూజీసీ నెట్ పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిప్టుల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
CSIR యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థులు 3 జనవరి 2022 వరకు అప్లై చేసుకోవచ్చు. CSIR పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి. అన్నింటిలోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.