ఛార్మి అనూహ్య నిర్ణయం.. పూరీ మాయలో పడి చివరికి ఇలా..!

charmi kaur sensational comments on her acting career
charmi kaur sensational comments on her acting career
charmi kaur sensational comments on her acting career
charmi kaur sensational comments on her acting career

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే మంచి పేరుతెచ్చుకున్న హీరోయిన్ ఛార్మి కౌర్. తన బొద్దు అందాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది ఛార్మి. హీరోయిన్ గా స్టార్ హీరోలతో నటించిన ఛార్మి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గాను రాణిస్తుంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి టాకీస్ నిర్మాణ సాసంస్థలో ఛార్మి ప్రధాన భూమిక పోషిస్తుంది. హార్ట్ అటాక్, మెహబూబా, జ్యోతిలక్ష్మి వంటి చిత్రాలను నిర్మించిన పూరి టాకీస్ ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా పూరి కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీకి కూడా ఛార్మినే నిర్మాతగా ఉంటుంది. దీనితో పాటు విజయ్ దేవరకొండ ప్రేస్టిజియస్ మూవీ లైగర్ మూవీకి కూడా లైన్ ప్రొడ్యూసర్ బాధ్యతల్లో బిజీగా ఉంది ఛార్మ. ఈ నేపథ్యంలో తన యాక్టింగ్ కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేసింది ఛార్మి. సినిమా నిర్మాణంలో తలమునకలైన ఛార్మి చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తనకు ఇక నటించాలని లేదంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది చార్మి.

రొమాంటిక్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ఈ పంజాబీ బ్యూటీ మాట్లాడుతూ.. ‘ హీరోయిన్ గా చేయటం కంటే నిర్మాతగా ఉండటం చాల బాధ్యతతో కూడుకున్న పని. హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు మన గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. మన ఫిట్నెస్ పై మాత్రం దృష్టి పెడితే చాలు. కానీ నిర్మాతగా ఉంటే అందరి గురించి ఆలోచించాలి. అందరి బాగోగులు మనం చూసుకోవాలి. ఇప్పటికి నాకు సినిమా అవకాశాలు వస్తున్నా.. ఇకపై నటించే అవకాశాలు మాత్రం లేవు. నాకు ఈ నిర్మాణ బాధ్యతల్లోనే టైం సరిపోతుంది. ఇక పై తనకు నటించే ఆలోచన కూడా లేదంటూ.. తన రిటర్మెంట్ గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది ఛార్మి. అయితే గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా.. రాఖీ, శ్రీఆంజేనేయం, జ్యోతిలక్ష్మి వంటి చిత్రాలతో మంచి నటిగాను గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి ఈ నిర్ణయానికి పూరి జగన్నాథ్ కారణమని సోషల్ మీడియా కామెంట్స్ వస్తున్నాయి. అప్పట్లో ఓ వ్యక్తిని నమ్మి తన నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే పూరి జగన్నాథ్ ని నిండాముంచేశాడు ఆ వ్యక్తి. అందుకే నమ్మకస్తురాలైన ఛార్మీకె తన బ్యానర్ బాధ్యతలని అప్పగించాడని.. దాంతో ఛార్మి నటన జీవితానికి స్వస్తి చెప్పేయనుందని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.