Home ఇది మీకు తెలుసా..! మీ బంగారం అసలు సరైందో కాదోనని టెన్షన్ పడకండి! జస్ట్ ఇలా టెస్ట్ చేస్తే చాలు...

మీ బంగారం అసలు సరైందో కాదోనని టెన్షన్ పడకండి! జస్ట్ ఇలా టెస్ట్ చేస్తే చాలు తెలిసిపోతుంది.

 

మన దేశంలో బంగారం అంటే మహిళలకు ఎంత ప్రేమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బారసాల నుంచి పెళ్లి వరకు ఏ ఫంక్షన్ అయినా సరే గోల్డ్ కొంటారు. దాంతో రకరకాల డిజైన్లతో నగలు చేయించుకుంటారు. గోల్డ్ కు ఉన్న డిమాండ్ ను బట్టి చాలామంది వ్యాపారులు కేటుగాళ్లు గోల్డ్ లో ఇతర లోహలను కలపటం, నకిలీ బంగారం అమ్మటం చేస్తుంటారు. చాలా మంది పసిడిని కొనే వారికి కూడా ఏదీ అసలో, ఏదీ నకిలీయో గుర్తు పట్టడం సాధ్యం కాదు. అచ్చం బంగారం లాగే ఉండే పాలిష్డ్, నకిలీ గోల్డ్ ను తక్కువ ధరకే అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. కానీ అసలైన బంగారం, నగల నాణ్యతను చెక్ చేయటానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లోనే కొన్ని చిన్న టెస్ట్ లు చేస్తే చాలు ఏదీ అసలో, ఏదీ నకిలీయో గుర్తించవచ్చు. ఐతే అది ఎలానో ఒకసారి తెలుసుకుందాం.

 

నీళ్లతో టెస్ట్ చేయవచ్చు

బంగారం అనేది చాలా కాస్ట్లీ. ఇది కొనేప్పుడు మోసపోతే చాలా నష్టపోతాం. అందుకే కచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. అన్నింటికన్నా ఈజీగా నీళ్ల ద్వారా గోల్డ్ నిజమైందో, కాదో మనం తెలుసుకోవచ్చు. ఇనుము లాగే బంగారం కూడా చాలా బరువుగా ఉంటుంది. ఒక్కసారి నీటిలో వేస్తే అది మునిగిపోతుంది. బకెట్ నీళ్లు తీసుకుని అందులో గోల్డ్ వేసి చూడండి. అది మునిగిందంటే అది ఫ్యూర్ గోల్డ్ అన్నట్టే. పైకి తేలిందంటే మాత్రం కచ్చితంగా నకిలీ గోల్డే. అందుకే మనమే జాగ్రత్త పడాలి. ఇంకా కొన్ని టెస్ట్ లతో కచ్చితంగా గోల్డ్ అసలు రూపం తెలుసుకోవచ్చు.

మెగ్నిటిక్ తో పరీక్షించవచ్చు

అయస్కాంతానికి ఇనుము సహా చాలా లోహాలు అతుక్కుంటాయి. కానీ స్వచ్ఛమైన బంగారం అయితే మాత్రం ఆయస్కాంతం అస్సలు ఆకర్షించదు. అయస్కాంతంతో టెస్ట్ చేసినప్పుడు బంగారంతో అయస్కాంతం ఆకర్షించిందంటే అది నకిలీ గోల్డే. ఐతే బరువైన అయస్కాంతంతో టెస్ట్ చేయాలి.

హాల్ మార్క్ టెస్టింగ్

ఇది దాదాపు అందరికీ తెలిసిందే. బంగారం నాణ్యత ఎంతన్నది హాల్ మార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. బంగారు అభరణాలు, క్వాలిటీని లెక్కించేందుకు ఉన్నదే. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్). చాలా వరకు బంగారం ఈ బీఐఎస్ మార్క్ ఉంటుంది. అది ఎంత నాణ్యత ఉందో దానిపై రాసి పెడతారు. గోల్డ్ షాప్ అతను చెబుతున్న దానికి..ఈ హాల్ మార్క్ కు సరిపోలుతుందా? అన్నది మనం గుర్తించాలి.

వెనిగర్ తోనూ బంగారం ఎలాంటిదో తెలుసుకోవచ్చు

జస్ట్ బంగారం మీద కొన్ని వెనిగర్ చుక్కలు వేస్తే బంగారం అసలు రూపం తెలుసుకోవచ్చు. అసలైన బంగారం కాకపోతే వెనిగర్ చుక్కలు మనం దేన్ని ఐతే టెస్ట్ చేస్తామో ఆ రంగులోకి మారుతుంది. కలర్ మారకపోతే అది నిజమైన గోల్డే.

చివరగా యాసిడ్ తోనూ టెస్ట్ చేయొచ్చు

యాసిడ్ తోనూ బంగారం అసలైందో లేదో తెలుసుకోవచ్చు. నైట్రిక్ యాసిడ్ గోల్డ్ పై వేస్తే దానిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇది ప్రమాదరకరమైన టెస్ట్ జాగ్రత్త గా ఉండాలి. బంగారు ఆభరణాలపై మెల్లగా రఫ్ చేయాలి. ఆ తర్వాత దానిపై కొంచెం యాసిడ్ వేయాలి. బంగారం కోటింగ్ మాత్రమే ఉంటే ఆ లోపల ఉన్న లోహం గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది. బంగారం నిజమైనదే అయితే ఎలాంటి రంగు మారదు.