డ్రగ్స్ ను స్వయంగా కాల్చేసిన సీఎం

అసోం లో డ్రగ్స్ వాడకాన్ని నివారించటంపై సీఎం హిమంత విశ్వకర్మ ఫోకస్ పెట్టారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటిన నాటి నుంచి డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటున్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి యూత్ చెడిపోతున్నారంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. డ్రగ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్న సంకేతం ఇచ్చేందుకు స్వయంగా ఆయనే మాదక ద్రవ్యాలను తగులబెట్టారు. పలు సందర్భాల్లో అధికారులు పట్టుకున్న 163 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పై బుల్డోజర్ ఎక్కించి, తొక్కించారు. ఆ తర్వాత సీఎం హిమంత విశ్వ కర్మ వాటిని కాల్చేశారు. రాష్ట్రంలో యూత్ పై డ్రగ్స్ ప్రభావం అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా చాలా కుటుంబాలే నాశనం అవుతున్నాయని చెప్పారు.