రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిగింది. 12 ఏండ్ల బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో తల్లిదండ్రులు పెండ్లి జరిపించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికకు పెద్దలు పెండ్లి చేశారు. దీంతో బాలిక.. పెళ్లి విషయాన్ని ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామస్థులకు తెలిపింది.
అనంతరం పెండ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. కానీ బాలిక తల్లిదండ్రులు బాలిక ఉన్న చోటుకు వచ్చి బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బంధువుల ఇంటి నుంచి బాలిక వెళ్లిపోయింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.