ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ నిర్వ‌హ‌ణ నుంచి త‌ప్పుకున్న చైనా

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఆసియా క‌ప్ ఫుట్‌బాల్ ఫైనల్స్ టోర్నీ నిర్వ‌హ‌ణ నుంచి చైనా త‌ప్పుకున్నది.  కోవిడ్ కారణంగా ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ నిర్వ‌హ‌ణ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆ దేశం స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు ఆసియ‌న్ ఫుట్‌బాల్ సంఘం(ఏఎఫ్‌సీ) శ‌నివారం వెల్ల‌డించింది.

నాలుగేళ్లకు ఓ సారి నిర్వహించే ఈ టోర్నీలో ఆసియా ఖండంలోని 24 దేశాలు పాల్గొంటాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. 2023 జూన్‌ 16 నుంచి జూలై 16వ తేదీ వ‌ర‌కు చైనాలో జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఆ టోర్నీని ఎక్క‌డ నిర్వ‌హించాల‌న్న దానిపై త్వరలోనే ప్ర‌క‌ట‌న చేస్తామని ఏఎఫ్‌సీ వెల్ల‌డించింది.