అరుణాచ‌ల్ యువ‌కుడ్ని అప్ప‌గించిన చైనా

China hands over Arunachal youth Miram Toror

ఇటీవ‌లే దేశ స‌రిహ‌ద్దుల్లో త‌ప్పిపోయిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌కుడు మిరామ్ టారోర్‌ను చైనా ఆర్మీ.. భార‌త సైన్యానికి అప్ప‌గించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

మిరామ్ టారోర్ అనే యువ‌కుడు ఈ నెల 18న చైనా సైన్యం అప‌హ‌రించింద‌ని అరుణాచల్  ఎంపీ ఆరోపించారు. స‌రిహ‌ద్దు గ్రామాల ద‌గ్గ‌ర ఈ యువ‌కుడు ఇత‌ర స్నేహితుల‌తో క‌లిసి వేట‌కు వెళ్లినప్పుడు ఇది జరిగిందని ఆయన తెలిపారు.

అయితే దీనిపై భార‌త సైన్యం అప్ర‌మ‌త్త‌మైంది. చైనా ఆర్మీతో మాట్లాడింది. అయితే ఆ యువ‌కుడు త‌మ దగ్గర లేడని చెప్పిన చైనా.. తర్వాత కన్పించాడని పేర్కొంది.