వైసీపీలో ఎంపీ సీటు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. ఊహాగానాలకి చెక్..!

Chiranjeevi Clarifies On His Political Entry In YSRCP Party
Chiranjeevi Clarifies On His Political Entry In YSRCP Party

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నిన్న మెగాస్టార్ చిరంజీవి భేటీపై నేడు సోషల్ మీడియాలో ఒకటే పుకార్లు. వైసీపీలో మెగాస్టార్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని.. అందుకే సీఎం జగన్ స్వయంగా చిరుని పిలిచాడని నెట్టింట్లో వార్తలు వచ్చాయి. చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశాడని.. దానికి చిరు కూడా సుముఖత వ్యక్తం చేశాడని.. వీరిద్దరి భేటీలో ఇదే అంశం చర్చలోకి వచ్చిందని ఒకటే గాసిప్స్. అయితే గడిచిన నెల రోజులుగా సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్స్ పై వివాదాల జరుగుతుండగా.. వీరిద్దరి భేటీకి నిన్న చాల ప్రాధాన్యత లభించింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించామని కూడా చిరంజీవి వివరణ ఇచ్చాడు.

సీఎం జగన్ తో లంచ్ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవి జగన్ మధ్య చర్చ జరిగినట్టు.. సినీ పరిశ్రమకి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న గ్యాప్ ని ఒకే ఒక్క మీట్ తో చిరంజీవి తొలగించేశాడని నిన్న అందరు ప్రశంసించారు. అయితే సడెర్న్ గా ఎలాంటి లీక్స్ వచ్చాయో కానీ.. చిరంజీవి జగన్ భేటీపై నేడు కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై చిరంజీవి తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని నమ్మొద్దంటూ స్వయంగా ట్వీట్ పెట్టాడు. ” తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం”.. అంటూ చిరంజీవి స్పష్టత ఇచ్చాడు. దీంతో ఈ రోజు ఉదయం నుండి వస్తున్న పుకార్లకు మెగా చెక్ పెట్టేసాడు చిరంజీవి.