చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి, ఎన్టీఆర్

Chiranjeevi, NTR wishing Chandrababu, Lokesh a speedy recovery

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటులు చిరంజీవి, ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు.

ఈ మేరకు వేర్వేరుగా ట్వీట్‌ చేశారు. ‘‘చంద్రబాబు, లోకేశ్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.’’అని చిరంజీవి ఆకాంక్షించారు. ‘మామయ్య చంద్రబాబు, లోకేశ్‌ త్వరగా కోలుకోవాలి’ అని ఎన్టీఆర్‌ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

తనకు కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్టు చంద్రబాబు ట్విటర్‌ ఖాతా ద్వారా మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉండవల్లిలోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. లోకేశ్‌కు సోమవారమే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.