మా ఎన్నికల తీరుపై చిరంజీవి గుస్సా.. పరువు పోతుంది అర్థం కావట్లేదా?

chiru fires on Maa Election Contestants

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి అసహనంగా ఉన్నారంటూ టాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. మా ఎన్నికల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో రచ్చ మొదలైంది. అర్థం లేని వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు చేసుకుంటూ రాజకీయ పార్టీల ఎన్నికలను మించిన హంగామా సృష్టిస్తుననారు. అక్టోబర్ 10న జరుగబోయే మా ఎన్నికల కోసం.. అసలు నోటిఫికేషన్ రాకముందు నుంచే నోటికి పనిచెప్పారు సినీ ఆర్టిస్టులు. ఒకవైపు ప్రకాష రాజ్ వర్గం.. మరోవైపు మంచు విష్ణు వర్గం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తుననారు. తాజా పరిస్థితులను గమనించిన తర్వాత సినీ ఇండస్ట్రీలోని చాలామంది పెద్దలకు అసలు మా ఎన్నికల మీద ఆసక్తే పోయిందని ఫిలింనగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా చిరంజీవి కూడా మా ఎన్నికల తీరుపై అసహనం వ్యక్తం చేశారట.

chiru fires on Maa Election Contestants

ఈ సారి మా ఎన్నికల్లో చిరంజీవి ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను సపోర్ట్ చేస్తున్నాడు. మంచు విష్ణుకు బాలకృష్ణ, కృష్ణంరాజు లాంటి నటుల సపోర్ట్ ఉంది. అయితే మా ఎన్నికలకు ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో వాతావరణం హీటెక్కింది. రెండు వర్గాల వారు నోరు అదుపును మరిచిపోయి.. హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన మెగాస్టార్ చిరంజీవి రెండు వర్గాల పట్ల కోపంగా ఉన్నారట. మనలో మనకు జరిగే ఎన్నికల గురించి ఇంతలా నోరు జారాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అందుకే.. మా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏం మాట్లాడకుండా ఉండాలని ఫిక్స్ అయ్యారట. ఎన్నికల సమయంలో, ఓట్ల కోసం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల పోయేది మన పరువే అంటూ చిరంజీవి రెండువర్గాల వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పద్ధతిగా.. హుందాగా ఎన్నికలు పూర్తి చేయాలని సూచించారట. అందరూ మనవాళ్లే.. ఏదైనా మాట్లాడే ముందు నోరు జారి మాట్లాడవద్దని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారట మెగాస్టార్.