‘మా’లో విద్వేషాలు.. ఈ పెద్దమనుషుల ఘోర తప్పిదాలే కారణమా..!

maa association divided into parts due to negligence of chiranjeevi murali mohan raghavendra rao
maa association divided into parts due to negligence of chiranjeevi murali mohan raghavendra rao
maa association divided into parts due to negligence of chiranjeevi murali mohan raghavendra rao
maa association divided into parts due to negligence of chiranjeevi murali mohan raghavendra rao

తెలుగు కళాకారులకి ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించాల్సిన సంస్థే మా అసోసియేషన్. 900మంది సభ్యులున్న      ఈ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ తో మొదలుపెడితే.. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, ఈసీ మెంబర్స్ అని కొంచం పొడవైన బాడీనే ఉంటుంది. వీరే ఇండస్ట్రీలోని సమస్యలని తీరుస్తామంటూ ఎన్నికలకు వెళ్తారు. కానీ రాను రాను పోటీకి దిగే సభ్యులే మా అసోసియేషన్ కి పెద్ద సమస్య అవుతున్నారు. మా అంటే ఒక కుటుంబమని.. మేమెంత ఒకటే అని కెమెరా ముందు డైలాగ్స్ కొట్టే వీళ్ళు.. తెరవెనుక మాత్రం కుల, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మా అసోసియేషన్ ని రెండుగా చీలుస్తున్నారు.

గెలిచిన వాడు ఎంత మంచి చేస్తాడో చూడకుండా .. పోటీలో ఉన్నోడి కులం, ప్రాంతం క్రైటీరియగా’ మా’ లో ఈ సారి ఓటింగ్ జరిగిందని కొందరు బహిరంగాగానే విమర్శిస్తున్నారు. వీటికి తోడు బూతులు తిట్టుకోవటం, వ్యక్తిగత దూషణలు చేసే సంస్కృతి ఉండనే ఉంది. ఇవన్నీ జరుగుతాయని అందరికి ముందే తెలుసు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని పెద్ద మనుషులకి అయితే క్లారిటీగా తెలిసే ఉంటుంది. అందుకే మొదట్లోనే అనవసర గొడవలు తలెత్తకుండా మా ఎన్నికలని ఏకగ్రీవం చేయాలనీ డిమాండ్స్ వినిపించాయి. కానీ వాటిగురించి ఏ మాత్రం పట్టించుకోలేదు ఇండస్ట్రీ పెద్దలు. తీరా ఇప్పుడు జరగాల్సిన రచ్చ జరిగి.. మా పరువు గంగలో కలిసాకా.. అరెరే ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే బావుండేదే అంటూ ఇప్పుడు కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. విష్ణు గెలిచినా, ప్రకాష్ రాజ్ ఓడినా..మా అసోసియేషన్ కి జరగాల్సిన డ్యామేజీ మాత్రం జరిగిపోయిందని లోలోన కొందరు మదన పడుతుంటే..  మరికొందరు బహిరంగంగా ఓపెన్ అవుతున్నారు.

జరగాల్సిన నష్టం జరిగాక పరువు గుర్తొచ్చిందా ?

తాజాగా శ్రీకాంత్ కొడుకు పెళ్ళిసందడి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇండస్ట్రీ దిగ్గజాలు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవిలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.  మా ఎన్నిక ఏకగ్రీవం అయితే బాగుండేదని అన్నారు రాఘవేంద్రరావు. అయినా విష్ణుపై తనకు నమ్మకం ఉందని, ఆయన బాగా చేస్తారని కూడా కితాబిచ్చారు. అంతకంటే ముందు మురళీమోహన్ కూడా అదే మాట అన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత మోహన్ బాబు కూడా ఇదే మాట అన్నారు. ఆ మాటకొస్తే.. చిరంజీవి కూడా ఎన్నికల తర్వాతే నోరు విప్పారు కానీ, ఎలక్షన్ ముందు, మీడియా ముఖంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీరు ఎం చేయాలనుకున్నారో కానీ మా పరువు నిలబెట్టడానికి మాత్రం ఏమిచేయలేదంటున్నారు నెటిజన్స్. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మా ఎన్నికల పుణ్యమాని.. సభ్యులంతా కులం ప్రాతిపదికన విడిపోయారు. మంచు ఫ్యామిలీ తాలూకు కులస్తులు వన్ సైడెడ్ గా విష్ణుకి ఓట్లు గుడ్డేశారు. ఈ స్ట్రాటజీ ని పసిగట్టని మెగా క్యాంప్ ఓటమిని మూటగట్టుకుంది.

‘మా’లో మునుముందు మరిన్ని గొడవలు ?

అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత ఆలస్యంగా మేలుకుని మా ఎన్నికలని ఏకగ్రీవం చేస్తే బావుంటుంది అని కామెంట్స్ చేయటం గమనార్హం. ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. మునుముందు ఈ కుల కుంపటి
‘మా’లో మరింత రగిలేలా ఉంది. ఎందుకంటే తెలుగువాడిని కాదని నన్ను పక్కనపెట్టాశారని ఇప్పటికి ప్రకాశ్ రాజ్ అవమానభారంతో కుమిలిపోతున్నారు. మంచు విష్ణుకి కులం ప్రాతిపాదికన ఓట్లు పడ్డాయనే నాగబాబు హార్ట్ అయ్యి      మా సభ్యత్వానికి రాజీనామా చేసాడాని ఫిలింనగర్ లో టాక్ వినపడుతుంది. వీరిద్దరికి మద్దత్తుగా మెగాస్టార్ వర్గం వారు మునుముందు మరింతమంది రాజీనామా చేసేఅవకాశాలున్నాయని.. దాంతో ‘మా’లో మరిన్ని గొడవలు అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా చిరంజీవి, మురళీమోహన్, రాఘవేంద్రరావు వంటి సినీ పెద్దలు ముందుచూపుతో ఈ సమస్యల్ని పరిష్కరించి.. కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ‘మా’ పరువుని కాపాడాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.