రేపట్నుంచి థియేటర్లు ఓపెన్.. జులై 23 నుంచి కొత్త సినిమాలు: తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్

Cinema-theater

కరోనా నేపథ్యంలో గ‌త కొద్ది నెల‌ల నుంచి మూత‌బ‌డ్డ సినిమా థియేట‌ర్లు త్వ‌ర‌లోనే తెరుచుకోనున్నాయి. రేపట్నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ కానున్నాయి.  ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలను థియేట‌ర్ల‌లో విడుదల చేసేందుకు  తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్ణ‌యించింది.

ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్రెసిడెంట్ ముర‌ళీమోహ‌న్, సెక్ర‌ట‌రీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిట‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో థియేట‌ర్ల ఓపెన్‌పై నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సమావేశం కంటే ముందు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు.. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా థియేట‌ర్ల‌కు ప్రభుత్వం ప్ర‌క‌టించిన రాయితీల‌పై ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని వారు మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.