నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రాంతాల్లో సూర్యుని చుట్టూ ఓ వలయాకార వృత్తం ఏర్పడడాన్ని ప్రజలు గమనించారు. ఆకాశంలో ఏర్పడిన అద్భుతాన్ని చూసేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎగబడ్డారు.
ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో వాతావరణం చల్లబడిన తర్వాత ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి వాతావరణంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వారు వివరించారు.