భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఓయూ డాక్టరేట్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ(శుక్రవారం) జస్టిస్ ఎన్వీ రమణకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, సీఎం కేసీఆర్ ఈ యూనివర్సిటీ ప్రొడక్ట్ లే.నేను ఓయూ “లా” కాలేజీలో చేరాలనుకున్నా..కాని అవకాశం దక్కలేదు. ఎంతో చైతన్య సంస్కృతి ఉద్యమాల నేపథ్యం కలిగింది ఉస్మానియా యూనివర్సిటీ. మాతృ మూర్తిని, మాతృ భాషని, మాతృ దేశాన్ని మరవద్దు. మూలాలు మర్చి పోతే చరిత్ర, జాతి క్షమించదు. ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు CJI ఎన్వీ రమణ.