మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ‘సీకే ప్రహ్లాద్’ పురస్కారం - TNews Telugu

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ‘సీకే ప్రహ్లాద్’ పురస్కారం



ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ ‘గ్లోబల్ బిజినెస్​ సస్టెయినబిలిటీ లీడర్​షిప్’ పురస్కారం 2021 ఏడాదికి గాను మైక్రోసాఫ్ట్ సీఈఓ, భారతీయ అమెరికన్ సత్యనాదెళ్లను వరించింది.

కర్బన ఉద్గార రహిత కంపెనీగా మైక్రోసాఫ్ట్​ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గాను మైక్రోసాఫ్ట్ అధినేత, వైస్ ఛైర్మన్ బ్రాడ్ స్మిత్​, చీఫ్​ పైనాన్షియల్ ఆఫీసర్​ అమీ హుడ్, చీఫ్​ ఎన్విరాన్​మెంట్ ఆఫీసర్​ లుకాస్​ జొప్పాతో కలిసి సత్య నాదెళ్ల ఈ అవార్డును పంచుకున్నారు.

ప్రపంచ దేశాల్లో ప్రైవేట్ రంగంలో అసాధారణ విజయాలు, సుస్థిరత సాధించిన వారికి వ్యాపార దిగ్గజం, భారతీయ అమెరికన్​ సీకే ప్రహ్లాద్ పేరిట ఈ​ పురస్కారాన్ని కార్పొరేట్ ఎకో ఫోరమ్(సీఈఎఫ్​) సంస్థ 2010 నుంచి అందిస్తోంది.