ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రూట్ క్లియర్..!

Telangana HIgh Court

రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాఖలైన పిల్ ను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు 2016లో జీవో 16ను జారీ చేసింది.

జీవో 16పై నిరుద్యోగి జె.శంకర్ హైకోర్టులో 2017లో పిల్ దాఖలు చేశాడు. విచారించిన హైకోర్టు.. జీవోపై గతంలో స్టే ఇవ్వడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

తాజాగా క్రమబద్ధీకరణపై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం పిల్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.