ఆరోగ్య తెలంగాణ కోసం బాటలు వేస్తున్నాం : ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR

కెసిఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు ప్రజారోగ్య రంగంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుతో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తతను కనబరుస్తున్నదని సీఎం అన్నారు. మాతా శిశు సంరక్షణా కేంద్రాలు, అమ్మఒడి వాహనాలు, ఆలన వాహనాలు, పరమపద వాహనాలు, మార్చురీల ఆధునీకరణ, కాత్ ల్యాబ్ కేంద్రాలు, అవయవ మార్పిడి కేంద్రాలు, స్టెమ్ సెల్ థెరపీ కేంద్రాలు, జెనోమిక్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలు వంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారాయన. ఇవన్నీ ప్రజారోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తుశుద్దికి నిదర్శనాలన్నారు సీఎం. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి ఆరోగ్య తెలంగాణ కోసం బాటలు వేస్తున్నామని సిఎం చెప్పారు. పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, ఎన్ సిడి స్క్రీనింగ్ ప్రోగ్రాం, మిడ్ వైఫరీ ప్రోగ్రాం, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, పారిశుధ్య నిర్వహణ పాలసీ, ఆసుపత్రులలో రోగులకు డైట్ చార్జెస్ పెంపు, ఆసుపత్రులలో సహాయకులకు సబ్సిడీ భోజనం వంటివి అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతపరిచామన్నారు ముఖ్యమంత్రి.  ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో పాటు, వైద్య సిబ్బందికి వేతనాలు పెంపు చేశామని, పలు ప్రోత్సాహకాలను పెంపు చేయటం జరిగిందని తెలిపారు. ఉద్యోగులకు, జర్నలిస్ట్ లకు హెల్త్ స్కీం, వైద్యులకు నర్సులు ఇతర సిబ్బందికి యూజీసీ నిబంధనల మేరకు పీఆర్సీని అమలు చేస్తున్నామన్నారు. పీజీ స్టూడెంట్స్, హౌస్ సర్జన్ లకు వేతనాలు పెంచామని గుర్తు చేశారు. ఆశ కార్య కార్య కర్తలు, కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచామని సిఎం కెసిఆర్ తెలిపారు.

Image
కరోనా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వే ను నిర్వహించి కరోనా ముందస్తు కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైరాలజీ (ఆర్టీపీసీఆర్) కేంద్రం ఏర్పాటు, విజయవంతంగా కోవిడ్ వాక్సినేషన్ నిర్వహణ, రాష్ట్రంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం వంటి చర్యలు కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ సమర్ధతకు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మూడంచెల వ్యవస్థ నుండి ఐదంచెల వ్యవస్థ కు విస్తరించామని సీఎం చెప్పారు. ఆరోగ్య సేవల వికేంద్రీకరణ చేపట్టి జిల్లా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసిందన్నారు సీఎం. ప్రాథమిక (పిహెచ్సీ, సీహెచ్సీ), ద్వితీయ (ఎహెచ్, డిహెచ్), తృతీయ – బోధనా ఆసుపత్రి, కొత్తగా ప్రివెంటివ్, సూపర్ స్పెషలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రివెంటివ్ వైద్యం కోసం పల్లె దవాఖాన, బస్తి దవాఖాన, సూపర్ స్పెషలిటీ లో టిమ్స్ ఆసుపత్రులు, మౌలిక వసతుల కల్పన చేసిందన్నారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన దవాఖానాల్లో పడకల సంఖ్యను పెంచడం జరిగిందరి సిఎం కెసిఆర్ తెలిపారు.