రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్ - TNews Telugu

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్cm kcr
cm kcr

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు దసరా అంటే ఒక ప్రత్యేకమైన వేడుక అని ఆయన అన్నారు. లక్ష్య సాధనలో గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకూడదని స్ఫూర్తి ఇచ్చే పండుగ దసరా అని ఆయన తెలిపారు. చెడుపై మంచి గెలుస్తుందనడానికి సంకేతమే విజయ దశమి అన్నారు. ఈ దసరా సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం, సిరి సంపదలు కలుగాలని ఆయన దేవుడిని ప్రార్థించారు.