ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావు

Minister Harish Rao and MP Prabhakar Reddy inaugurated the Glow Garden at Komati Pond in Siddipet town.

ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రుల పర్యటన చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధికమంత్రి టి.హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, ఇంజెక్షన్ లు, ఆక్సిజెన్ అందుబాటులో ఉందన్నారు.

జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామం లోని కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ఇవాళ ప్రారంభించి మాట్లాడారు. జహీరాబాద్ లోని కల్వరి టెంపుల్ లో 100పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఒక్క రూమ్ లో ఉండి జీవితం గడిపే వారికి కోవిడ్ బారిన పడితే ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు.

బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కోఠి, గాంధీ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు హరీష్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు కోసం వాక్సిన్ ఉత్పత్తిదారులకు రూ.100కోట్ల విడుదల చేసిందన్నారు. వ్యాక్సిన్ కేటాయింపు కేంద్రం చేతిలో ఉండటం దురదృష్టకరమని, అందుకే వాక్సిన్ ను కొనుగోలు చేయలేకపోతున్నామన్నారు.

వాక్సిన్ అందరికి అందుబాటులో తెచ్చేందుకు కొత్త సంస్థ లకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రానికి మంత్రి సూచించారు.  జహీరాబాద్ లో  4రోజుల్లో ఆక్సీజెన్ ప్లాంట్ ఏర్పాటు, ఉత్పత్తి ప్రారంభం అవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ ఫౌండర్ సతీష్ కుమార్, జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యే కె. మానిక్ రావు, ఎమ్మెల్సీ ఎండి ఫరీదుద్దీన్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.