చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన సీఎం కేసీఆర్ - TNews Telugu

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన సీఎం కేసీఆర్సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ శనివారం కలిశారు. రాజ్ భవన్ లో బస చేస్తున్న ఆయనను సీఎం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. చీఫ్ జస్టిస్ గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం హైదరాబాద్ విచ్చేశారు. ఆ తర్వాత తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆయనతో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా యాదాద్రికి వెళ్తారు.