సీఎం కేసీఆర్ ‘మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు

CM KCR ‘Milad Un Nabi’ Greetings

CM KCR ‘Milad Un Nabi’ Greetings

మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకునే  ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదర భావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త  బోధనలు, సూక్తులు, సూచించిన ధార్మిక విషయాలు అనుసరణీయాలని సీఎం కేసీఆర్ అన్నారు.