మొన్న ఢిల్లీకి వెళ్లిన కారణం చెప్పిన సీఎం కేసీఆర్

cm kcr reveals sensational facts about last delhi tour
cm kcr reveals sensational facts about last delhi tour

మూర్కులు తాము కూర్చున్న చెట్టు కొమ్మని తామే నరుక్కుంటారన్నట్టు.. దేశంలోని ఆర్థిక వ్యవస్థని బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. నేడు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రలకి వచ్చే నిధులలో దారుణంగా కోతలు విధిస్తున్నారని.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చే నిధుల విషయంలో చేస్తున్న మోసాన్ని వివరిస్తూ.. మొన్నటి ఢిల్లీ పర్యటన విషయాలని రివీల్ చేశారు సీఎం కేసీఆర్.

FRBM చట్టం ప్రకారం కాకుండా నిధుల సమీకరణలో కోతలు విధిస్తు.. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తుందని సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని పబ్లిక్ సెక్టార్ వ్యవస్థలు తీసుకునే అప్పులని కూడా రాష్ట్ర ప్రభుత్వాల కాతాలో వేసి.. నిధులు సరిగ్గా మంజూరు చేయటం లేదన్నారు. పబ్లిక్ సెక్టార్స్ అప్పులని రాష్ట్ర ప్రభుత్వ అప్పులని అనటం అన్యాయమని.. ఈ విషయాలను ఢిల్లీలో లేవనెత్తానని.. దీనిపై ఢిల్లీలో తీవ్రంగా చర్చించానని కేసీఆర్ చెప్పారు. పీఏసీలని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో చూపెట్టి.. తెలంగాణకి ఇవ్వాల్సిన 53వేల కోట్లల్లో.. కేంద్ర ప్రభుత్వం 25వేలు కోత విధించిందని చెప్పారు.

దీనితో పాటు కరెంట్ కి సంబందించిన ఉదయ్ అనే స్కీమ్ లో మనం 12వేల కోట్ల రుణాలు తీసుకుంటే.. దాన్ని కూడా FRBM చట్టం ప్రకారం నిధుల్లో కోత విధిస్తామంటున్నారు. దాంతో నేను ఢిల్లీ వేదికగా కేంద్ర నిర్ణయాన్ని ఖండించానని.. మర్యాదగా నిధులు ఇస్తారా లేకపోతే సుప్రీం కోర్టులో కేసు వేయమంటారా అని హెచ్చరిస్తే.. దెబ్బకి 10వేల కోట్లు తీసేసి 15వేల కోట్ల నిధులు మాత్రమే ఆపేశారని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రెటరీ లతో కలిసి ఢిల్లీలో చర్చించి, కేసు వేస్తామని కేంద్రాన్ని ప్రశ్నిస్తేనే మోదీ ప్రభుత్వం దిగివచ్చిందని గత ఢిల్లీ మీటింగ్ పై స్పదించారు సీఎం కేసీఆర్.