అవార్డులు, పొగడ్తలు ఉన్నా.. నిధులు మాత్రం సున్నా..!

cm kcr serious on bjp
cm kcr serious on bjp

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రంపై తన నిరసనను వ్యక్తం చేశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే తాను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా కేంద్రతీరుని కూడా ఎండగట్టారు. కేంద్ర విధానాలతో దేశంలో రైతాంగం బాగా దెబ్బ తిన్నదని.. దేశ ప్రజల్లో ద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయని.. ప్రధాని మోడీ చేసిన ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువుపోతోంది. దేశం భవిష్యత్ ప్రమాదంలో పడుతోంది అని బాధని వ్యక్తీకరించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇక అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తూ.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణపై బీజేపీ సవతి ప్రేమ కనపరుస్తుందని.. మనకి అవార్డులు, పొగడ్తలు మాత్రమే ఉంటాయి.. కానీ రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు మాత్రం ఇవ్వరు. 1లక్ష 90వేల కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తే.. కేంద్రం నుంచి కేవలం 5వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రాల ప్రగతిని కేంద్రం పెద్దల తీరు దెబ్బతీస్తోంది. ఒక చిన్న ట్విట్ తో రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఎగ్గొడుతారా.. 14లక్షల కోట్లు సెస్ పేరుతో రాష్ట్రాలకు పంచాల్సిన పన్నులు కేంద్రం ఎగ్గొట్టింది అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర బీజేపీపై ఫైర్ అయ్యారు.