కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ హెచ్చరిక

CM KCR warns

CM KCR warns Central Election Commission

కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఈసీ తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవరించాలని, తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగా భార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నాను. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నానని అన్నారు.

కేసీఆర్ స‌భ పెట్టొద్దని కొంద‌రు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్. హుజూరాబాద్‌లో స‌భ నిర్వ‌హించొద్దంటూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారన్నారు. మ‌న పార్టీ నాయ‌కులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులని, ఈసీ ఏం చేసినా న‌వంబ‌ర్ 4 త‌ర్వాత ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగి తీరుతుందని అన్నారు. న‌వంబ‌ర్ 4 తర్వాత హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి, దళిత బంధు పథకాన్ని పూర్తి చేస్తారని అన్నారు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్ర‌జ‌లు దీవించి, ఆశీర్వ‌దిస్తారని, రాష్ట్ర‌మంత‌టా ద‌ళిత బంధును అమ‌లు చేస్తామని చెప్పారు.