ఈటల జమున ఆరోపణలపై స్పందించిన కలెక్టర్ హరీష్

Jamuna-Hatcheries

ఈటల రాజేందర్ సతీమణి జమున చేసిన ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పందించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట లోని సర్వే నంబర్ 81, 130 లలో పట్టా భూమి లేదు. సీలింగ్, అసైన్డ్  మాత్రమే ఉందన్నారు.

రెండు సర్వే నంబర్లలో 8.36 ఎకరాల భూమిని  చట్ట విరుద్ధంగా తన పేరిట జమున కొనుగోలు చేశారు. రెండు సర్వే నంబర్లలోని 33 ఎకరాల భూముని గతంలో 18 మంది పేదలకు పంపిణీ చేశినట్లు చెప్పారు.

Jamuna-Hatcheries-1

ప్రభుత్వ భూమిలో జమున హేచరీస్ యాజమాన్యం రోడ్లు, భారీ పౌల్ట్రీ షెడ్లను అక్రమంగా నిర్మించారు. భూముల సర్వే సమయంలో జమున హేచరీస్ ప్రతినిధులు హాజరయి పంచనామాలో సంతకాలు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే ఆమె ప్రెస్ మీట్ లో మరోలా మాట్లాడారని కలెక్టర్ హరీష్ తెలిపారు.