రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నరసింహారెడ్డిని మేడ్చల్‌ మాల్కాజిగిరికి బదిలీ చేసింది. మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న విద్యాసాగర్‌ను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జి. రమేష్‌ను మెదక్‌, మోహన్‌రావును సూర్యాపేట అదనపు కలెక్టర్లుగా నియమించింది. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ పి. రాంబాబును నిర్మల్‌కు బదిలీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజేశంను కొమురంభీమ్‌ జిల్లాకు బదిలీ చేసింది. మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లును హైదరాబాద్‌కు, జోగులాంబ గద్వాల అడిషనల్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డిని నాగర్‌ కర్నూలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Collectors Transfers in telangana
Collectors Transfers in telangana

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రఘురాం శర్మను జోగులాంబ గద్వాల జిల్లాకు, నాగర్‌ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న మధుసూదన్‌ను మంచిర్యాలకు, ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణిని వరంగల్‌ అర్బన్‌కు బదిలీ చేశారు. వరంగల్‌ రూరల్‌ అదనపు కలెక్టర్‌గా బీ.హరిసింగ్‌ను నియమించింది.