కత్తి మహేష్ డెత్ మిస్టరీలో కొత్త ట్విస్ట్.. అతనిపైనే అనుమానాలు.. తేనే తుట్టని మళ్ళీ కదిపిన పృథ్వీ..!

Comedian Prudhvi Raises Doubts On Kathi Mahesh Death Again
Comedian Prudhvi Raises Doubts On Kathi Mahesh Death Again
Comedian Prudhvi Raises Doubts On Kathi Mahesh Death Again
Comedian Prudhvi Raises Doubts On Kathi Mahesh Death Again

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ మరణం అప్పట్లో ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. కారు ప్రమాదం నుండి కోలుకుని ఇంటికి తిరిగొస్తాడనుకుంటున్న తరుణంలో కత్తి మహేష్ తుదిశ్వాస విడవటం కలిచివేసే అంశం. అయితే అప్పట్లో ఈయన మృతి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. తగిన శాస్తి జరిగిందంటూ ఒక ప్రముఖ హీరో ఫ్యాన్స్ కత్తి మహేష్ మృతిపై విపరీతంగా నెగిటీవ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన మృతిపై అప్పట్లో ఎన్నో అనుమానాలు రేగాయి. ఆ ఆక్సిడెంట్ లో.. కారులో ప్రయాణిస్తున్న మహేష్ కత్తికే గాయాలు కావటం ఏంటి.. మరోకొద్దీ రోజుల్లో డిస్చార్జ్ చేస్తామని చెప్పిన చెన్నై డాక్టర్లు ఎవ్వరు ఊహించని విధంగా మరణించాడని చెప్పటం ఏంటంటూ.. అప్పట్లో అందరు విచారణకి కూడా డిమాండ్ చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగకపోవటంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. అయితే మళ్ళీ ఇన్నిరోజులకి కత్తి మహేష్ డెత్ మిస్టరీని తెరపైకి తీసుకొచ్చాడు కమెడియన్ పృథ్వీ. రీసెంట్ గా ఒక టీవీ ఇంటర్వ్యూ కత్తి మహేష్ మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేసాడు కమెడియన్ పృథ్వీ. మహేష్ చనిపోయినప్పుడు కూడా పృథ్వి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కానీ అప్పట్లో వాటిని పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు. మళ్ళీ పృథ్వి కత్తి మహేష్ మృతిపై సంచలన కామెంట్స్ చేశాడు.

కత్తి మహేష్ ఇప్పుడు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ లేని లోటు తెలుస్తుంది.. అటు జర్నలిజంలో కానీ.. ఇటు క్రిటిక్‌ గా కానీ ఆయన చేసే విమర్శలు అర్థవంతంగా ఉండేవి.      నేను ఎంచుకున్నదే కరెక్ట్ అని అనేవాడు.. అని చెప్పారు పృధ్వి. చనిపోయే ముందు తనకి వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయని కత్తి మహేష్ చెప్పారని, నటుడిగా.. దర్శకుడిగా బిజీ అయ్యే టైంలో కత్తి మహేష్ చనిపోవడం బాధాకరమని పృద్ది అన్నారు. కత్తి మహేష్ మొదటి నుంచి టార్గెట్ అయ్యాడని, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్‌లో ఉండగానే చనిపోయాడని చెప్పారు. అది చాలా దారుణం. కత్తి మహేష్ మరణం ఖచ్చితంగా ఓ మిస్టరీనే అన్న పృధ్వి, కత్తి మహేష్ మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయని.. ఎదురుగా ఉన్నపెద్ద లారీని డీ కొట్టినా.. ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కి చిన్న గాయం కూడా కాకపోవటం ఏంటి.. పక్కన కూర్చున్న కత్తి మహేష్ కి అంతపెద్ద గాయాలు అవ్వటమేంటో నాకు ఇప్పటికి అర్ధం కావటం లేదు. కత్తి మహేష్ అంతలా గాయపడి కన్నుమూయడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. తాను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటే స్టడీ చేసేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు పృథ్వి రాజ్.