కామన్వెల్త్​ గేమ్స్​: పారా టేబుల్​ టెన్నిస్​లో ఫైనల్​కి ఇండియా

Bhavina Patel

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌కి మరో పతకం ఖాయమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇవాళ (శుక్రవారం) పారా టేబుల్ టెన్నిస్‌లో పోటీపడిన భవీనా ఇంగ్లండ్‌‌కి చెందిన సుబెయిలీని ఓడించి ఫైనల్‌కి చేరింది. 11-6, 11-6, 11-6 తేడాతో గెలిచిన భ‌వీనా.. సెమీస్ నుంచి పైన‌ల్స్ కి దూసుకెల్లింది. దీంతో భారత్‌ ఖాతాలో మరో మెడల్ చేరడం కూడా ఖాయమైంది.

ఇప్పటికే వెయిట్‌లిప్టింగ్, బాక్సింగ్, లాన్ బౌల్స్ తదితర ఈవెంట్లలో భారత్‌కి పతకాలు దక్కాయి. ఈ క్రమంలో ఇప్పటికే 20 మెడల్స్ ని ఖాతాలో వేసుకున్న భారత్.. పతకాల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.