దేశం గర్వించేలా కొడుకుని పెంచావ్.. మాధవన్ పై ప్రశంసలు.. షారుఖ్ పై విమర్శలు.. ఏంటీ చెత్త పోలిక ?

comparison between shahrukh khan and madhavan sons
comparison between shahrukh khan and madhavan sons
comparison between shahrukh khan and madhavan sons
comparison between shahrukh khan and madhavan sons

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవ్వటం. మూడుసార్లు బెయిల్ తిరస్కరణకు గురవ్వగా.. మరోసారి బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతలోనే బెయిల్ కోసం 25కోట్ల భారీ డబ్బు డిమాండ్ చేసినట్టు డ్రగ్స్ కేసు విచారిస్తున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై ఆరోపణలు వస్తున్నాయి. అయితే కొందరు తెరవెనుక కావాలనే షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రెటీలు, సామాన్యులు విచారణలకి హాజరైనా.. ఇన్ని రోజులు జైల్లో ఉండటం, వరుసగా బెయిల్ తిరస్కరణకు గురవ్వటం షారుఖ్ కొడుకు కేసులోనే జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కొన్ని శక్తులు పనిగట్టుకుని షారుఖ్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని.. అందులో భాగంలోనే షారుఖ్ ని ఇరికించడానికి బెయిల్ కోసం 25కోట్ల తెరమీదకి తీశారని అంటున్నారు. ఇప్పుడు వీరికి షారుఖ్ ని విమర్శించడానికి మరో కొత్త టాపిక్ దొరింది. అదే మాధవన్ కొడుకు ఇష్యు.

ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత మాధవన్ అద్భుతమైన స్విమ్మర్‌. స్విమ్మింగ్‌లో వేదాంత 7 జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు కూడా. 16 ఏళ్ల వేదాంత్ 7 పతకాలు సాధించడంతో రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి అతనిపై ప్రశంసలు కురిపించారు. తన కృషితో తన కుటుంబంతో పాటు దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నాడు అని కామెంట్స్ చేస్తూనే మాధవన్ పెంపకాన్ని కూడా పొగిడాడు. ఇక్కడే షారుఖ్ ని ట్రోలింగ్ చేసే బ్యాచ్ తెరమీదికొచ్చి అవమానిస్తున్నారు. మాధవన్ గురించి అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. “మీ పెంపకం గురించి మేము గర్విస్తున్నాం” తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో షారుఖ్ ఖాన్ పెంపకంపై విమర్శలు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన తర్వాత అతనితో మాధవన్ కొడుకును నెటిజన్లు పోల్చుతున్నారు. 16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు.. వీరిద్దరి తండ్రుల పెంపకంలో ఎంత తేడా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మాధవన్ కొడుకు వేదాంత సాధించిన ఘనత గొప్పదే అయినా.. ప్రతి విషయాన్ని షారుఖ్ కొడుకుతో పోలుస్తూ కావాలని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ చేయటం కరెక్ట్ కాదని మరికొందరు షారుఖ్ ఖాన్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.