రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ కీలక భేటీ

sonia rahul

సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ రేపు సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై  ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ, గౌరవ్ గగోయ్, కే. సురేశ్, జైరాం రమేశ్, మాణిక్యం టాగోర్, రణ్‌వీర్ భిట్టు తదితరులు హాజరుకానున్నారు.