కానిస్టేబుల్‌ జాక్‌పాట్‌.. రూ.6తో రూ.కోటి లాటరీ

పంజాబ్‌ లూధియానాకు చెందిన కుల్దీప్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌ జాక్‌పాట్‌ కొట్టారు. 6 రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్‌ తో రూ.కోటి గెలుచుకున్నారు.

ఓ రోజు లాటరీ టికెట్లు కొనాలని కుమారుడికి కుల్దీప్‌ సింగ్‌ తల్లి సూచించింది. తల్లి మాట విని కొన్ని లాటరీ టికెట్లు కొన్నాడు కుల్దీప్‌. అందులో రూ.ఆరు పెట్టి కొన్న లాటరీ ఇప్పుడు ఆయన్ను కోటీశ్వరుడిని చేయడం గమనార్హం.