మీసాలు తీయ‌నందుకు కానిస్టేబుల్ స‌స్పెండ్‌

Constable Rakesh Rana,

మీసాలు తీయనందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీస్ ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. పోలీస్ విభాగంలో డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్న రాకేశ్ రాణా… మీసాలు పెంచుకున్నాడు. అయితే తన మీసాల‌ను వెంట‌నే ట్రిమ్ చేసుకోవాల‌ని ఉన్న‌తాధికారులు ఆయ‌న‌ను ఆదేశించారు.

కానీ రాకేశ్ ఈ ఆదేశాల‌ను పట్టించుకోలేదు. దీంతో ఉన్నతాధికారులు ఆయ‌న్ను స‌స్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సస్పెండ్ ఉత్త‌ర్వుల‌పై రాకేశ్ రాణా స్పందించారు. తను రాజ్‌పుత్‌ నని, మీసాలు తనకు గ‌ర్వ‌కార‌ణమని, తన ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం కావడంతోనే మీసాలను ట్రిమ్ చేసుకోలేదని రాకేశ్ స్ప‌ష్టం చేశాడు.