ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం

న్యూఢిల్లీ: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రాంభమయ్యాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ నడిబొడ్డున పార్టీ భవన్ నిర్మాణ పనులను మంత్రి మొదటి నుంచే దగ్గరుండి పర్యేక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పర్మీషన్స్ తీసుకున్నారు. MDP ఇన్ఫ్రా నిర్మాణ సంస్థకు భవన్ నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కీలక ఘట్టంలో తనకు భాగస్వామ్యం కల్పించిన కేసిఆర్‎కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.