కూల్ డ్రింక్స్ తాగుతున్నారా… అయితే మీ ప్రాణాలకు ముప్పే

cool drinks will effect to lives researches reveals
cool drinks will effect to lives researches reveals
cool drinks will effect to lives researches reveals
cool drinks will effect to lives researches reveals

రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న వారు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల తొందరగా చనిపోతారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. సోడా లేదా కూల్‌డ్రింక్స్‌ అరుదుగా తాగేవారితో పోలిస్తే.. వారానికి కనీసం ఐదుసార్లు కూల్ డ్రింక్స్ తాగే మహిళల్లో మరణం ముప్పు 62శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే మహిళలు కూల్‌డ్రింక్స్‌ తాగితే వారి ప్రాణాలకు ముప్పు 85శాతం అధికంగా ఉంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. సోడా, కూల్ డ్రింక్స్, స్వీట్ డ్రింక్స్, రొమ్ము క్యాన్సర్‌పై అమెరికాలోని బఫెలో స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థులు చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సోడా తాగడం వల్ల బరువు పెరగడం, టైప్‌-2 మధుమేహం, గుండె జబ్బులు రావడం వంటి ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ చాలామంది తియ్యటి సోడా తాగడం మానలేకపోతున్నారని అధ్యయనంలో తేలింది.

cool drinks will effect to lives researches reveals
cool drinks will effect to lives researches reveals

తొందరగా చనిపోతున్నారట..
రొమ్ము క్యాన్సర్‌కు గురైన 35 నుంచి 79 ఏండ్ల మధ్య మహిళలపై 19 ఏండ్లపాటు అధ్యయనం చేశామని, వీరిలో 927 మంది కేవలం తీయటి శీతల పానీయాలు తాగడం వల్ల మృత్యువాత పడ్డారని అధ్యయనంలో తేలింది. రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించడానికి 12 నుంచి 24 నెలల ముందు వారు ఏమి తిన్నారు, ఏమి తాగారన్నదానిపై వారిని ప్రశ్నించామని తెలిపారు. వారిలో 900 మంది మహిళలు శీతల పానీయాలు తాగడం వల్లనే రొమ్ము క్యాన్సర్‌కు గురైనట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వీరిలో 41 శాతం మంది అతి త్వరగా మరణించారని తెలిపారు.

cool drinks will effect to lives researches reveals
cool drinks will effect to lives researches reveals

అస్సలు మంచిది కాదు
సోడాలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుందని, పోషక విలువలు ఏమాత్రం ఉండవని, ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తుందని కోయరాట్టి వివరించారు. చక్కెర లేని టీ, కాఫీలు, పండ్ల రసాలలో పోషక విలువలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. చక్కెరతో కూడిన సోడాలో సుక్రోస్‌, ఫ్రక్టోస్‌ అధిక స్థాయిలోఉంటాయని, వీటిలోని గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం 35 లక్షల మంది రొమ్ముక్యాన్సర్‌ బాధితులు ఉన్నారని తెలిపారు.