మళ్లీ భయపెడుతున్న కరోనా. పెరుగుతున్న కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,336 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే దాదాపు 4 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294 కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 5, 24,954 మంది మృతిచెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా,  కర్ణాటకలో లోనే సగానికి పైగా కేసులు నమోదయ్యాయి.