దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు - TNews Telugu

దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు



దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది.

నిన్న మరో 246 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 4,51,435కు చేరింది. తాజాగా 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నాను. దేశంలో రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది.

ప్రస్తుతం 2.06 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 35.66 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ అయిన వ్యాక్సిన్ల సంఖ్య 96.82 కోట్లకు చేరిందని  కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.