ప్రభుత్వ ముందుచూపుతో కరోనా తీవ్రత తగ్గింది.. ఇంకా కరోనా మొత్తం పోలేదు.. పండుగల వేళ జాగ్రత్తలు తప్పనిసరి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు - TNews Telugu

ప్రభుత్వ ముందుచూపుతో కరోనా తీవ్రత తగ్గింది.. ఇంకా కరోనా మొత్తం పోలేదు.. పండుగల వేళ జాగ్రత్తలు తప్పనిసరి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత మూడు నెలల నుండి తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే కరోనా తీవ్రత తగ్గిందన్నారు. అన్ని జిల్లా ఆసుపత్రిలో పిడియాట్రిక్స్ బెడ్స్ ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ఆసుపత్రుల పరిధిలో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

రికవరీ రేటు పెరిగింది

రాష్ట్రంలో రికవరీ రేటు చాలా పెరిగింది. రానున్న మూడు నెలలు పండగ సీజన్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికీ రోజు 200 నుండి 250 వరకు కేసులు నమోదు అవుతున్నాయని ఆయన గుర్తుచేశారు.  కేవలం కొన్ని జిల్లాలో మాత్రమే కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు.. ఇప్పుడు జాగ్రతలు పాటించక పోతే కరోనా కు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు.

కరోనా మొత్తం పోలేదు

రీసెంట్ గా 17 ఏళ్ల అమ్మాయి కరోనా బారిన పడి చనిపోయిందని ఆయన చెప్పారు. ఇంకా కరోనా మొత్తం పోలేదు. జాగ్రతలు తప్పనిసరి తీసుకోవాలి. పండగలు, విందులు, షాపింగ్ చేసేటప్పుడు జాగ్రతలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్యామిలీలో ఒకరు కరోనా బారిన పడితే మిగతా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాల హెల్త్ డైరెక్టర్ సూచించారు.

అవసరమైతేనే ప్రయాణాలు చేయండి

పండుగల నేపథ్యంలో ప్రయాణాలు మొదలు అయ్యాయి. పక్క రాష్ట్రాల్లో ఇంకా కరోనా ప్రభావం ఉంది. కాబట్టి జాగ్రతలు తప్పనిసరి పాటించాలి. అవసరమైతే నే ప్రయాణాలు చేయండి. డిసెంబర్ వరకు మరింత జాగ్రతలు తీసుకోవాలి. కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో మాస్క్ పెట్టుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోవడంతోపాటు సోషల్ డిస్టెన్స్ ఎక్కడ కనిపించడం లేదన్నారు.

రెండు డోసులు తీసుకుంటేనే రక్షణ

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.01కోట్ల మందికి కనీసం ఒక డోసు కొవిడ్‌ టీకా ఇచ్చామని, 38శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు వివరించారు. ఇంకా 25 లక్షల మంది సెంకడ్ డోస్ డేట్ దాటిన వ్యాక్సిన్ తీసుకోకుండా తిరుగుతున్నారు. సిటీ లో 5 లక్షల మంది ఉన్నారు.  రెండు డోసులు తీసుకుంటేనే కొవిడ్‌ పూర్తి రక్షణ లభిస్తుందన్నారు.